ఎంపీలపై దాడికి నిరసనగా నేడు సీమాంధ్ర బంద్

Seemandhra-bandh

నేడు సీమాంధ్ర బంద్ కు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపునిచ్చింది. రాష్ట్రానికి చెందిన ఎంపీలపై ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు దాడి చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త బంద్ పాటించాలని ఏపీఎన్జీవో నేత అశోక్ బాబు అన్నారు. మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణకు ఏదైనా జరిగితే సోనియాగాంధీనే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. సొంత పార్టీ ఎంపీలపైనే కాంగ్రెస్ పార్టీ దాడి చేయించిందని ఆయన ఆరోపించారు. మోదుగుల, కొనకళ్లపై కాంగ్రెస్ పార్టీ ఎంపీల దాడిని ఆయన ఖండించారు. కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, పళ్లంరాజు, కిశోర్ చంద్రదేవ్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని ఆయన అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.