ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌పై విచారణ రేపటికి వాయిదా

supreme court 1హైదరాబాద్, అక్టోబర్ 28: ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. మంగళవారం కళాశాలలు సుప్రీం కోర్టుకు ఇచ్చిన అకాడమిక్‌ షెడ్యూల్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఏఐసీటీఇ నింబంధనలు మేరకు ఈ అకాడమిక్‌ షెడ్యూల్‌ లేదంటూ కాలేజీలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఐసీటీఇ నిబంధనల ప్రకారం ప్రతీ సంవత్సరం 525 గంటల పాటు తరగతులు నిర్వహించాల్సి ఉంది, అయితే కాలేజీలు ఇచ్చిన అకాడమిక్ షెడ్యూల్‌ ప్రకారం 62 రోజులు తక్కువగా రావడంతో వీటిని ఏవిధంగా భర్తీ చేస్తారంటూ కాలేజీలను సుప్రీం ప్రశ్నించింది. పనిగంటలు పెంచి నష్టపోయిన పనిదినాలు పూర్తి చేస్తామని కళాశాలలు న్యాయస్థానం దృష్టికి తీసుకురాగా, దానికి ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. మరో అకాడమిక్‌ షెడ్యూల్‌తో ముందుకు రావాలని కాలేజీలను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారం కి వాయిదా వేసింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.