ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టుల మృతి?

maoist-5

(పాత చిత్రం)

విశాఖపట్నం, జనవరి 5: ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఒడిశా రాష్ట్రంలోని మల్కన్ గిరి జిల్లా బెజ్జంగి బెజ్జంగి అటవీప్రాంతంలో బిఎస్ ఎఫ్, సీఆర్ పి ఎఫ్ బలగాలు సోమవారం కూంబింగ్ నిర్వహించే క్రమంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 5 మావోయిస్టులు మృతిచెందినట్లుగా సమాచారం.

మావోయిస్టుల అగ్రనేతలతో పాటు సుమారు వంద మంది మావోయిస్టులతో పెదబయిలు అటవీ ప్రాంతానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోతట్టు అటవీప్రాంతంలో బస చేసినట్లు సమాచారం అందడంతో సీఆర్ ఫిఎఫ్ బలగాలు అప్రమత్తమై కాల్పులు జరిపారు. దీంతో మావోయిస్టులు ఒడిశా వైపు వెళ్తుండటంతో, అక్కడ కూంబింగ్ జరుపుతున్న ఒడిశా బీఎస్ఎఫ్ జవాన్లు కూడా అప్రమత్తమై కాల్పులు జరపడంతో 5 మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా, బెడంగి ప్రాంతంలో 5 గురు మావోయిస్టుల మృత దేహాలను గుర్తించినట్లు సమాచారం. కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.