ఎమ్మెల్యే భూమాకు 15 రోజుల రిమాండ్

bhuma nagi reddy 1కర్నూలు, నవంబర్ 1 : కర్నూల్ జిల్లా నంద్యాల ఏఎస్పీ ఎదుట లొంగిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ భూమాకు 15 రోజుల రిమాండ్ విధించారు. భూమాకు అనారోగ్యంగా ఉందని ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యాయత్నం కేసు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు భూమాపై పోలీసులు రెండు కేసులను నమోదు చేశారు. పోలీసులు నిన్నటి నుంచి గాలిస్తుండటంతో భూమా నాగిరెడ్డి ఈ రోజు లొంగిపోయారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.



Recent Posts
Recent Posts