ఎల్ పిజీ గ్యాస్ నగదు బదిలీకి ఆధార్ తప్పనిసరి : కలెక్టర్

kmm collector-29

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఖమ్మం జిల్లా కలెక్టర్ కె.ఇలంబరితి

ఖమ్మం, నవంబర్ 29: ఎల్పిజీ గ్యాస్ నగదు బదిలీ పొందేందుకు వినియోగదారులు అందరూ తప్పనిసరిగా ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలను సంబంధిత గ్యాస్ డీలర్లకు అందించాలని జిల్లా కలెక్టర్ కె.ఇలంబరితి జిల్లా ప్రజలను కోరారు. 2015 జనవరి నుంచి అమలుకానున్న నగదుబదిలీ పథకంపై ఆయిల్ కార్పోరేషన్ ప్రతినిధులు, లీడ్ బ్యాంక్ మేనేజర్, పౌరసరఫరాల అధికారులతో శుక్రవారం కలెక్టర్ సమీక్షించారు. ఎల్ పిజీ గ్యాస్ వినియోగదారుల నుండి వారి ఆధార్, బ్యాంకు పాస్ పుస్తకం మొదటి పేజీ జిరాక్సు ప్రతులను సేకరించాలని కలెక్టర్ వారికి సూచించారు.

అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ వినియోగదారులు ఇంకా ఆధార్, బ్యాంక్ ఖాతాలను అనుసంధానం చేసుకోనివారు సత్వరమే అనుసంధానం చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 3 లక్షల 61 వేల 28 మంది డీలర్ల వద్ద, 2 లక్షల 48 వేల 61 మంది వివిధ బ్యాంకుల్లో వినియోగదారులు అనుసంధానం చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. 2015 జనవరి నుంచి మూడు నెలలపాటు అందరికి నగదు బదిలీ వర్తంచబడుతుందని, ఈ మూడు నెలల్లోపుగా వినియోగదారులు తప్పనిసరిగా ఆధార్, బ్యాంక్ ఖాతాలు ఎల్ పిజీ నగదు బదిలికి అనుసంధానం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. లేనిపక్షంలో నగదు బదిలీ సబ్సీడి వర్తింపులో జాప్యం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.  ఈ సమావేశంలో డిఎస్ఓ గౌరీ శంకర్, ఎల్డిఎమ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.