‘ఎవడు’ సక్సెస్ టూర్

Yevadu-success-meet

సంక్రాంతి పండుగకు విడుదలైన ‘ఎవడు’ చిత్రం మంచి విజయాన్ని సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ నిర్వహిస్తోంది. ‘ఎవడు’ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులను స్వయంగా కలుసుకుని కృతజ్ఞతలు తెలపడానికి ఈ విజయయాత్రను ప్లాన్ చేస్తున్నారు. జనవరి 17 నుంచి ఈ యాత్ర నుంచి ప్రారంభమవుతుందని చిత్ర నిర్మాత దిల్ రాజు తెలిపారు.

17 వ తేదీ యాత్ర తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు పట్టణాలలో జరుగుతుంది. 18న విజయవాడ, భీమవరం, పాలకొల్లు, రాజమండ్రి పట్టణాలలో యాత్ర జరుగుతుంది. రామ్ చరణ్ కెరీర్లోనే ‘ఎవడు’ అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డుకెక్కుతుందని దిల్ రాజు చెప్పారు. రామ్ చరణ్ తో బాటు సినిమా యూనిట్ మొత్తం ఈ సక్సెస్ టూర్ లో పాల్గొంటుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.