ఎవరితోనైనా పొత్తుకు సిద్ధం : అమిత్ షా

amit shah-23

హైదరాబాద్, డిసెంబర్ 23: జమ్మూకశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరితోనైనా సిద్ధమని బిజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. కశ్మీర్ లో బిజేపికి అనూహ్యమైన విజయమన్నారు. 2014 బిజేపికి ఎన్నికల విజయనామ సంవత్సరంగా ఆయన అభివర్ణించారు. 25 స్థానాలు సాధించి భారతీయ జనతా పార్టీ కీలకస్థానంలో ఉందని ఆయన తెలిపారు. చాలాకాలం తరువాత జార్ఖండ్ ప్రజలు బిజేపికి మెజారీటి ఇచ్చారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్, జార్ఖండ్ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. సుస్థిర, నీతివంతమైన పాలను అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.