ఏఐసీసీ సమావేశానికి లగడపాటి, హర్షకుమార్ హాజరు

Lagadapati-harshakumar

ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశానికి ఆరుగురు సీమాంధ్ర ఎంపీలకు ఆహ్వానం అందకపోవడంతో తీవ్ర అసంతృప్తి చెందిన ఎంపీలు అధిష్ఠానంతో అమీతుమీ తెల్చుకోవడానికి ఢిల్లీ వెళ్లారు. అక్కడ వీరీతో చర్చించిన అనంతరం సమావేశానికి లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్ హాజరయ్యారు. సమావేశంలో ఎంపీలు తెలంగాణ, సమైక్యాంధ్ర ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సమావేశంలో సమైక్యవాదం వినిపిస్తారన్న అనుమానంతోనే ఆరుగురు సీమాంధ్ర ఎంపీలకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆహ్వానాలు పంపలేదు. అంతేకాక సోనియా రాజకీయ సలహాదారు ఫోన్ చేసి మరీ సమావేశానికి రావద్దని ఎంపీలను కోరారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.