ఏటీఎంలకు మైక్రోసాప్ట్ హెచ్చరిక

ATM

ఆర్థిక సంస్థల్లోని పర్సనల్ కంప్యూటర్లు, ఏటీఎంలకు సెక్యురిటీ రిస్క్‌లు తప్పకపోవచ్చని అమెరికా సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ హెచ్చరించింది. ఏటీఎంలలో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఎక్స్ పీని 2001 అక్టోబర్ లో ఇన్‎స్టాల్ చేసారు. అయితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రస్తుతమున్న విండోస్ 8 తో పోల్చితే మూడు జనరేషన్ లు వెనకబడి ఉంది.

ఈ నేపథ్యంలో తప్పని సరి విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ ని అప్ గ్రేడ్ చేయాలని, ఎప్రిల్ 8 నుంచి విండోస్ ఎక్స్ పీ సపోర్ట్ సర్వీసులు నిలిపివేస్తామని మైక్రోసాప్ట్ సంస్థ వెల్లడించింది. భారతదేశంలో ప్రస్తుతం లక్ష వరకూ వివిధ రకాల బ్యాంకు ఏటీఎంలున్నాయి. వీటిలో చాలా వరకు విండోస్ ఎక్స్ పీ పైనే పనిచేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ హెచ్చరికలపై ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్(ఐబీఏ) స్పందించింది. దాదాపు అన్ని ఏటీఎంలలో అప్ గ్రేడ్ వర్షన్ విండోస్ 8 వుందని, కేవలం కొన్ని పాత ఏటీఎంలకు మాత్రమే అలాంటి సమస్య ఉంటుందని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ సర్వీసులు ఆగిపోతే ఏటీఎం సర్వీసులు నిలిచిపోయే ప్రమాదం వుందని, సత్వరం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆర్‎బీఐ హెచ్చరించింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.