ఏదేమైనా మా రాష్ట్రాన్ని మేం రక్షించుకుంటాం: సీఎం

CM-kiran-kumar-reddy

ఏది ఏమైనా మా రాష్ట్రాన్ని మేం రక్షించుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శాసనసభ, మండలి బిల్లును తిరస్కరించాయని, దాన్ని కేంద్రం కూడా అంగీకరించాలని కోరారు. రాజకీయాల నుంచి వైదొలగడం అంటే కొత్త పార్టీ స్థాపించడం కాదని చెప్పారు. సభ తిరస్కరించిన బిల్లును యథాతథంగా పార్లమెంటు ఆమోదిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సీఎం పునరుద్ఘాటించారు. తెలంగాణ నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ తప్పు చేసిందన్న కిరణ్, విభజన వల్ల తాగు, సాగునీటికి సమస్యలు వస్తాయని చెప్పుకొచ్చారు.

తనకు రాజకీయ భవిష్యత్తు కంటే రాష్ట్రం సమైక్యంగా ఉండటమే ముఖ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఓ భాగమని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పిడితే మనుగడ సాగించలేదని పేర్కొన్నారు. విడిపోతే తెలంగాణ రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. తమకు రాష్ట్రం సమైక్యంగా ఉండటమే ప్రధానమని తెలిపారు. ఢిల్లీ నుంచి తెలుగు జాతి భవిష్యత్తును నిర్ణయించలేరన్న కిరణ్, ప్రజల మనోభావాలను కేంద్రం గౌరవించాలని, నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని సూచించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.