ఐటెం సాంగ్స్ కి గుడ్ బై అంటున్న మీనాక్షి

ఐటం సాంగ్స్‎తో మంచి పేరు తెచ్చుకున్న మీనాక్షి దీక్షిత్ ఇకపై ఐటెం పాటలకు ‘గుడ్ బై’ అంటోంది. ఇటీవలి కాలంలో ఈ అమ్మడు తెలుగు సినిమాలకు మంచి ఐటెం గాళ్ గా కనిపించిన సంగతి మనకు తెలిసిందే. ఈ తరహా పాటల్లో విరివిగా అందాల ఆరబోత పోసిన సెక్సీతారగా ఆమె పేరు తెచ్చుకుంది. ‘దూకుడు’, ‘బాద్ షా’ సినిమాలలో ఆమె చేసిన ఐటెం పాటలకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడిక అలాంటి పాటలు చేయనని చెబుతోంది. కథానాయికగానే రాణించాలని నిర్ణయం తీసుకుంది.

“అవును … కథానాయక పాత్రలపై దృష్టి పెడుతున్నాను. ప్రస్తుతం మూడు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తున్నాను. తెలుగులో ‘అడవి కాచిన వెన్నెల’, హిందీలో ‘పీ సే పీఎమ్’ సినిమాలోనూ, తమిళంలో వడివేలు హీరోగా నటిస్తున్న సినిమాలోనూ నటిస్తున్నాను” అని చెప్పింది మీనాక్షి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.