ఐపీఎల్-7 వేలంలో 514మంది ఆటగాళ్లు

ipl-7

ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో జరగనున్న ఐపీఎల్-7 వేలంకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఈ మేరకు 514 మంది ఆటగాళ్ల పేర్లతో ఓ జాబితాను విడుదల చేశారు. ఈసారి వేలంలో ఏ జట్టులో లేని ఆటగాళ్లను కూడా వేలానికి తీసుకుంటున్నారు. అంటే ఇందులో 219 మంది అగ్రస్థానంలో ఉన్న క్రీడాకారులు ఉంటారు. వీరిలోనే 169 మంది భారత్ ఆటగాళ్లు, 50 మంది విదేశీ ఆటగాళ్లు ఉంటారు. ఇక 292 మంది ఏ జట్టులో లేని ఆటగాళ్లు ఉంటారు. వారిలో 255 మంది భారత్ ఆటగాళ్లు, 37 మంది విదేశీ ఆటగాళ్లు ఉండనున్నారు. మొత్తం ఎనిమిది ఫ్రాంఛైజీలు పాల్గొంటున్న ఈ వేలంలో వచ్చే మూడేళ్లకు వేలంపాట జరుగుతుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.