ఐశ్వర్యరాయ్ బచ్చన్ పేరుతో చత్తీస్ గఢ్ లో ఓటర్ కార్డు మంజూరు

Aishwarya-rai

మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ పేరుతో చత్తీస్ గఢ్ లో ఓటర్ కార్డు మంజూరైంది. ముంబైలో నివాసం ఉంటున్న ఐశ్వర్యకు ఛత్తీస్ గఢ్ లో ఓటు ఎలా వచ్చిందో తమకూ అర్థం కాలేందంటున్నారు రాష్ట్ర అధికారులు. చత్తీస్ గఢ్ లోని జష్ పూర్ జిల్లా పతల్ గావ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గుగ్రీ గ్రామ ఓటర్ల జాబితాలో ఐశ్వర్య పేరుంది. దీనికి అనుబంధంగా జత చేసిన చిత్రం కూడా ఆమెదే ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ఎల్ కె సేన్ తెలిపారు. ఈ పేరుతో గుగ్రీలో ఎవరూ లేరని నిర్ధారించామన్నారు. దీన్ని ఎవరో కావాలనే చేసిన పనిగా భావిస్తున్నామని దీనిపై విచారణ జరిపి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని బగీచా సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ కేసీ దేవగన్ కు సూచించామని కలెక్టర్ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.