ఒక్క రూపాయికే కిలో బియ్యం : ఈటెల రాజేందర్

హైదరాబాద్, నవంబర్ 1: అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కార్డులు ఇస్తామని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కార్టుల జారీలో గ్రామాలు, పట్టణాలు అన్న తేడాలు లేవన్నారు. రేషన్‌ కార్డులపై శనివారం ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేసారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

etela 2 copy

ప్రభుత్వం ఎక్కువ మంది పేదలకు తెల్లకార్డులు ఇవ్వాలని నిర్ణయించిందని ప్రకటించారు. మంత్రి వర్గం ఉపసంఘం సమర్పించిన నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి మార్పులు లేకుండా ఆమోదించారని ఆయన పేర్కొన్నారు. ఒక రూపాయికే కిలో బియ్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి స్పష్టం చేశారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆరు కిలోల బియ్యం ఇవ్వనున్నట్టు ఈటెల తెలిపారు. ఇందుకోసం గ్రామాల్లో ఆదాయ పరిమితిని  రూ 1.50 లక్షలు,  పట్టణాలకు 2 లక్షలకు పెంచామని తెలిపారు. 7.5 ఎకరాల మెట్ట, 3.5 ఎకారాల మాగాణి దాటితేనే తెల్ల కార్డులు పొందటానికి అనర్హులని తెలిపారు. పించన్లకు ఇవే నిబంధనలు వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఆధార్ కార్డులు లేకపోయినా తెల్ల రేషన్‌ కార్డులు ఇస్తామని ఈటెల స్పష్టం చేశారు. అయితే అందరూ ఆధార్‌ కార్డులు తీసుకోవాలని ఆయన సూచించారు. కొత్త రేషన్‌ కార్డులు వచ్చే వరకు పాత రేషన్ కార్డులపైనే బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.