కంగనా రనౌత్: నటనలో మర్మం తెలుసుకున్న

కంగనా రనౌత్ కు కాలం కలసి రాకపోయినా ఆమెలో ఉన్న సానుకూల దృక్పథాన్ని చాలా మెచ్చుకోవాలి. ఈమె నటించిన ‘ఐ లవ్ యూ న్యూ ఇయర్’, ‘అంగ్లి’ సినిమాలు రెండూ తెర వెనుకే ఉండిపోయాయి. అయినా సరే తానేమీ నిరాశకు గురికావడం లేదని చెప్పింది. ఐ లవ్ యూ న్యూఇయర్ సినిమా.. రొమాంటిక్, కామెడీ కథాంశంగా రూపుదిద్దుకుంది.

రాధికారావు, వినయ్ సప్రు దర్శకత్వం వహించగా, కంగనా, సన్నీడియోల్ తదితరులు నటించారు. దీన్ని గతేడాది ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకున్నారు. తర్వాత ఏప్రిల్ కు వాయిదా పడింది. ఆ తర్వాత సెప్టెంబర్ కు.. మళ్లీ డిసెంబర్ కు అలా అన్నీ వాయిదాలే. అయినా నేటికీ ఇది బాక్సాఫీసు ముందుకు రాలేకపోయింది. ట్రయిలర్ కు వచ్చిన స్పందన చూసి విడుదల విషయంలో జడుసుకుని ఆగిపోయారట.

ఇక అంగ్లి కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో తెరకెక్కుతోంది. దీనిలో కంగనా, ఇమ్రాన్ హష్మి, సంజయ్ దత్, నేహా దూపియా, రణదీప్ హుడా తదితరులు నటులుగా ఉన్నారు. దీన్ని ముందుగా 2013లోనే విడుదల చేయాలనుకున్నారు.

అయినా నెరవేరలేదు. ఈ ఏడాది మేలో విడుదల చేయనున్నట్లు కరణ్ జోహార్ చెప్పగా.. తాజాగా కంగనా అది కూడా నిలిచిపోయినట్లు తెలిపారు. మరి, రెండు ప్రతిష్ఠాత్మక చిత్రాలు ఆగిపోతే బాధ లేదా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఎందుకు బాధ? నా పారితోషికం నాకు వచ్చేసింది’ అని అసలు విషయం చెప్పేసింది. కంగనా నటించిన మరో చిత్రం ‘క్వీన్’ మార్చి 7న విడుదల కానుంది. ఆమె చేతిలో మరో చిత్రం కూడా ఉంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.