కంటోన్మెంట్ ఎన్నికల్లో తెరాసాకు నాలుగు స్థానాలు

contonment-13_sa

హైదరాబాద్, జనవరి 13: కంటోన్మెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 8 వార్డులకు ఎన్నికలు జరగగా నాలుగు వార్డులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరో రెండింటిలో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్దులు విజయం సాధించారు. కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్ధులు చెరో వార్డులో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. 8 వార్డుల్లో ఒక్క సీటు కూడా ఈ కూటమి గెలుచుకోలేకపోయింది.

కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణకు ఈ ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన కుమారుడు, కుమార్తె ఇద్దరు పరాజయం పాలయ్యారు. రెండో వార్డులో టీఆర్ఎస్ బలపరచిన సదా కేశవరెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి సర్వే కుమార్తె సుహాసినిపై 2087 ఓట్ల మెజారీటీతో గెలుపొందారు. 4వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్ధి నళిని కిరణ్ స్థానిక ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్యపై 600 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 5వ వార్డులో స్వతంత్ర అభ్యర్ధి రామకృష్ణ సర్వే కుమారుడు నవనీత్ ని ఓడించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.