కన్నడలో బిజీ అయిన ‘తీన్ మార్’ హిరోయిన్

Kriti-kharbanda-hot-stills

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’ సినిమాలో హిరోయిన్ గా తన ప్రతిభను కనబరిచి టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ముద్దుగుమ్మ కృతి కర్బందా కు ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అవకాశాలు లేవు. అయితెనేం… శాండల్ వుడ్ (కన్నడ)లో ఈ భామ చాలా బీజీగా ఉంది. ఏకంగా నాలుగైదు ప్రాజెక్టుల్లో హిరోయిన్ గా చేస్తుంది. వాటిలో రెండు తెలుగు నుంచి రీమేక్ అవుతున్న చిత్రాలు కావడం విశేషం. రవితేజ నటించిన ‘కిక్’ చిత్రాన్ని కన్నడలో ‘సూపరో రంగా’ గా రీమేక్ చేస్తున్నారు. అలాగే తెలుగులో తాజాగా మంచి సక్సెస్ సాధించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ను కన్నడలో ‘తిరుపతి ఎక్స్ ప్రెస్’ గా రీమేక్ చేస్తున్నారు. ఒకేసారి రెండు రీమేక్ చిత్రాల్లో నటించడం చాలా థ్రిల్లింగ్ గా ఉందని  కృతి తెలిపింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.