కప్పట్రాళ్ల హత్యకేసులో 21 మందికి జీవిత ఖైదు

venkatappa naidu-10

కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు (పాత చిత్రం)

కర్నూలు, డిసెంబర్ 12: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు హత్య కేసు తుది తీర్పు వెలువడింది. వెంకటప్పనాయుడు హత్యకేసులో 21 మందికి శిక్ష ఖరారు చేస్తూ ఆదోని సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించింది.

కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు తన సొంతూరు కపట్రాల నుంచి కర్నూల్ వెళ్తుండగా ప్రత్యర్ధులు ఆయనను హత్యచేశారు. వెంకటప్పనాయుడు ప్రయాణిస్తున్న జీపును లారీతో బలంగా ఢీకొట్టి వేటకొడవళ్లతో మూకుమ్మడిగా దాడిచేసిన ఘటనలో వెంకటప్పనాయుడుతో సహా 10 మంది హత్యకు గురయ్యారు.

వెంకటప్పనాయుడు బంధువు పరప్పనాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు 48 మందిపై కేసు నమోదు చేశారు. ఆరు సంవత్సరాల విచారణ అనంతరం 21 మందికి జీవిత ఖైదుతోపాటు వెయ్యిరూపాయల జరిమానా విధిస్తూ కర్నూల్ జిల్లా ఆధోని సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించింది. జీవిత ఖైదు పడిన 21 మందిలో ముగ్గురు ఇప్పటికే మృతిచెందగా, మరో వ్యక్తి అజ్ఞాతంలో ఉన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.