కమిలినితో జతకడుతున్న సుమంత్

కమిలినితో జతకడుతున్న సుమంత్

టాలీవుడ్ లో ఎలిజిబుల్ బ్యాచిలర్ సుమంత్ త్వరలో పెళ్ళి కొడుకు కావచ్చని తెలుస్తోంది. ఇంతకు ముందు సుమంత్ కీర్తి రెడ్డిని పెళ్ళి చేసుకున్నా ఆ పెళ్ళి ఎక్కువ కాలం నిలవలేదు. ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత సుమంత్ పెళ్ళి పట్ల పెద్దగా ఆసక్తి కూడా చూపించలేదు. ఇప్పుడు కమిలిని ముఖర్జీ పట్ల సుమంత్ ఆసక్తి చూపిస్తున్నాడని టాలీవుడ్ టాక్.  వీరిద్దరు ’గోదావరి‘ సినిమాలో జంటగా నటించారు. అప్పటి నుంచే వారి మధ్య ప్రేమ చిగురించిందని పుకారు.  ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ హాట్ గాసిప్. పెళ్ళి నిజంగా జరుగుతుందా? ఎప్పుడు జరుగుతుందన్నది వేచి చూడాల్సిందే.

Have something to add? Share it in the comments

Your email address will not be published.