కర్ణాటక ప్రభుత్వం సానుకూల స్పందన : చంద్రబాబు

హైదరాబాద్, నవంబర్ 10: తుంగభద్ర నుంచి నీటి మళ్లింపుపై కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బెంగుళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సోమవారం చంద్రబాబు సమావేశమై పలు విషయాలను చర్చించారు. అనంతరం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంయుక్తంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాయలసీమ తాగు నీటి కోసం తుంగభ్రద నుంచి నీటి మళ్లించే విషయమై చర్చించామని తెలిపారు. తుంగభ్రద ఆధునీకరణపై బోర్డుకి విన్నవించాలని నిర్ణయించామని, ఆధునీకరణ జరిగితే ఇటు కర్ణాటకతోపాటు రాయసీమకు కూడా లబ్ది జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తుంగభ్రదలో పూడిక వల్ల నీటి నిల్వ సామర్ధ్యం తగ్గిపోయిందన్నారు. అదే విధంగా హెచ్ ఎల్ సీ కాలువ నుంచి అనంతపురం జిల్లాకు నీటి విడుదల, ఆర్ డీ ఎస్ వివాదం తదితర అంశాలపై చర్చించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాలు నీటిపారుదల శాఖ అధికారులు, మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.