కలిసి పనిచేద్దాం – లక్ష్యాన్ని సాధిద్దాం

smart city-17

హైదరాబాద్, జనవరి 17: అందరూ కలిసి మెలిసి పనిచేసుకుంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్మార్ట్ విలేజ్-స్మార్ట్ వార్డు వెబ్ సైట్ ను సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని ఎన్ టి రామారావు ప్రబోదించారన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా, తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్ టిఆర్ ని ఎవరూ మరచిపోలేరని పేర్కొన్నారు. పేదరికంలేని, ఆర్ధిక అసమానతలు లేని ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని నిర్మాణం చేయాలని తెలుగుదేశం పార్టీ సంకల్పమన్నారు. 2022 కి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి రాష్ట్రంగా, 2029కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో మొదటి స్థానంలో ఉండాలని, 2050కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలో ఒక అత్యున్నత స్థాయిలో ఉండాలని తెలుగుదేశం పార్టీ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు.

గ్రామ స్వరాజ్యం కోసం కలలుకన్నారు, అయితే ఈ రోజు గ్రామాలు లేనిదే పట్టణాలులేవు, దేశం లేదు. అలాంటి సమయంలో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి కావాలి దీనిని ఒక పద్ధతిప్రకారం, ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకోపోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ప్రగతికోసం ప్రజా ఉద్యమం కింద ఒక కార్యక్రమాన్ని స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ గా ఒక కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ టి రామారావు వర్ధంతి రోజున లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కార్యక్రమంలో యనమల రామకృష్ణుడు, పల్లె రఘనాధరెడ్డి, పరకాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.