కష్టంతోనే అభివృద్ధి సాధ్యం : చంద్రబాబు

cm-japan tour-1

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 1 : రెండవ ప్రపంచ యుద్ధంలో పూర్తిగా దెబ్బతిన్న జపాన్ ఎన్నో సమస్యలను అధిగమించి ప్రపంచంలో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశ జనాభాలో 10వ వంతు ఉన్న జపాన్ అక్కడి ప్రజలకున్న నిరంతర శ్రమ, కష్టపడే మనస్తత్వం ఉండటంతో అభివృద్ధి సాధ్యమైందన్నారు. అంతేకాకుండా జపనీయుల మంచి క్రమశిక్షణ కలిగిన వారని పేర్కొన్నారు. జపాన్ లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తారని తెలిపారు. అక్కడ వ్యవసాయ రంగం మొదలుకొని టెక్నాలజీ వరకు జపాన్ అన్ని రంగాల్లో ముందంజలో ఉందని చంద్రబాబు తెలిపారు. జపాన్ లో ఆర్ధికంగా పుంజుకున్న ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సాధించిన ప్రగతిని పర్యవేక్షించామన్నారు. జపాన్‌ పర్యటనలో పలు సంస్థలతో చర్చలు జరిపామని, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించినట్లు చెప్పారు. పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అబివృద్ధి కోసం పలు కంపెనీలతో ఒప్పందాలు చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

జపాన్‌ ఆర్థిక స్థితిని మార్చిన కొన్ని సంస్థల అధిపతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే బాగుంటుందని బాబు ఆకాంక్షించారు. జపాన్‌ ప్రధానిని కలిసి, ఇండియా-జపాన్‌ సమ్మిట్‌కు హాజరుకావాలని ఆహ్వానించినట్లు చంద్రబాబు తెలిపారు. జపాన్‌ పర్యటన సంతృప్తినిచ్చిందన్న చంద్రబాబు త్వరలో జర్మనీ, సౌత్‌ కొరియా దేశాల్లో పర్యటించనున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.