కాంగ్రెస్ పాలనకు స్వస్తి చెప్పే సమయం ఆసన్నమైంది: విజయమ్మ

YS-vijayamma

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లాలో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రచారం నిర్వహించారు. కొత్తగూడెంలో రోడ్ షోలో ఆమె పాల్గొని ప్రసంగించారు. వైఎస్సార్సీపీని ఆదరిస్తే అందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రైతులకు అండగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. గడచిన నాలుగున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారని ఆమె అన్నారు. కాంగ్రెస్ పాలనకు స్వస్తి చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. మంచి నాయకుడిని, మంచి పార్టీని ఎన్నుకొంటే ప్రజలకు మేలు జరుగుతుందని విజయమ్మ అన్నారు.

తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో ఎంతో మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని విజయమ్మ విమర్శించారు. బాబు పాలనలో వ్యవసాయం చేయలేక ఎక్కువ మంది రైతులు వలసలు పోయారని, రాష్ట్రంలో కరవు తాండవించిందని ఆమె ఆరోపించారు. తన హయాంలో ఐటీ పరంగా అభివృద్ధి జరిగిందంటున్న బాబు, రూ. 55 వేల కోట్ల అప్పుల గురించి మాట్లాడటం లేదెందుకని ఆమె ప్రశ్నించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.