కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు కన్నుమూత

paladugu-sa-19

పాలడుగు వెంకట్రావు (పాత చిత్రం)

హైదరాబాద్, జనవరి 19: కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావ్ (75) సోమవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

1940, నవంబర్ 11న కృష్ణా జిల్లా ముసనూరు మండలం గోగులంపాడు గ్రామంలో జన్మించిన పాలడుగు 1968 లో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1972లో తొలిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం 1978లో జరిగిన ఎన్నికల్లో నూజివీడు నియోజవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అంజయ్య, భవనం వెంకట్రామ్, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కేబినెట్ లో పాలడుగు మంత్రిగా పని చేశారు. గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

కొంత విరామం తర్వాత 1989లో రెండవసారి నూజివీడు నియోజవర్గం నుంచి శాససభ్యుడిగా ఎన్నికయ్యారు. 2009, 2011లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి హయాంలో రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పాలడుగు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.