కార్టూనిస్ట్ ఆర్.కే లక్ష్మణ్ ఇకలేరు

r k laxman-27

ఆర్.కే. లక్ష్మణ్ (పాత చిత్రం)

పుణె, జనవరి 26: ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్.కే. లక్ష్మణ్ అనారోగ్య కారణంగా జనవరి 26న కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన పుణెఆస్పత్రిలో చికిత్సపొందుతూ 26వ తేదీ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 83 సంవత్సరాలు.

కామన్ మేన్ పాత్రను సృష్టించి, దానికి తన వ్యంగ్య చిత్రాల్లో స్థానంకల్పించిన లక్ష్మణ్ సామాన్యుని పక్షాన నిలచి రాజకీయ నాయకులపై వ్యంగ్యాస్ర్తాలు సంధించేవారు.

లక్ష్మణ్ పూర్తిపేరు రాసీపురం కృష్ణస్వామి లక్ష్మణ్. ఆయన 1921 అక్టోబరు 24న మైసూరులో ఓక ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించారు. తండ్రి కుటుంబంలోని ఆరుగురు కుమారుల్లో లక్ష్మణ్ చివరి వారు. ప్రముఖ రచయిత ఆర్ కే నారాయణ్, లక్ష్మణ్ సోదరులే. కన్నడ వ్యంగ్య పత్రిక కొరవంజిలో ఇలస్ట్రేటర్ గా ఆయన కెరీర్ ప్రారంభించారు. ఆయన పద్మవిభూషణ్, మెగసెసే , తదితర విశేష పురస్కారాలు ఎన్నోఅందుకున్నారు.

ఆర్.కే. మృతిపట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానిమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తదితర ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.