కార్మిక చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

parliament-28

హైదరాబాద్, నవంబర్ 28: కార్మిక చట్టాల సవరణ బిల్లుకు శుక్రవారం లోక్ సభ ఆమోదం తెలిపింది. దీనివల్ల చిన్న సంస్థలకు రికార్డుల నిర్వహణ, రిటర్నుల దాఖలు పరంగా వెసులుబాటు లభిస్తుంది. అసంఘటిత రంగ కార్మికుల ప్రయోజనాల రక్షణకు ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సభ దీన్ని ఆమోదించింది. టీఎంసీ, కాంగ్రెస్, సీపీఎం పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. దీని వల్ల కార్మికుల నష్టం కలిగే అవకాశం ఉందని ఆరోపించాయి. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికుల ప్రయోజనాల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సంస్కరణలు తీసుకొచ్చే క్రమంలో కార్మికుల హక్కుల రక్షణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని వివరించారు. ఏఐఏడీఎంకే, టీఆర్ ఎస్ బిల్లుకు మద్దతు తెలిపాయి. ఈ బిల్లును ఇటీవలే రాజ్యసభ ఆమోదించిన విషయం తెలిసిందే.

Have something to add? Share it in the comments

Your email address will not be published.