కార్మిక సంఘాలతో బొత్స చర్చలు విఫలం

Botsa-Rtc-employees

రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఆర్టీసీ ఈయూ, టీఎంయూ నేతల చర్చలు విఫలమయ్యాయి. ఆర్టీసీ ఉద్యోగులకు మధ్యంతర భృతి ఎంత ఇవ్వాలనేదానిపై అధికారులతో చర్చిస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీపై ఇప్పటికే ఉన్న ఆర్థిక భారం, సంస్థ నష్టాలు, మనుగడ వంటి సమస్యలన్నీ దృష్టిలో ఉంచుకుని సమ్మె ఆలోచన విరమించుకోవాలని కార్మికులకు సూచించారు. సమస్య పరిష్కారమయ్యేవరకు చర్చలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

దీంతో ఆర్టీసీ కార్మికులంతా ఈ నెల 27 నుంచి సమ్మెకు సిద్ధం కావాలని ఈయూ ప్రధాన కార్యదర్శి పద్మాకర్ కార్మికులకు పిలుపునిచ్చారు. మధ్యతర భృతి 32 శాతం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.