కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ముస్తఫా మృతి

హైదరాబాద్, అక్టోబర్ 9: కాలిన గాయాలతో చికిత్సపొందుతూ బాలుడు ముస్తఫా (11) గురువారం ఉదయం మృతి చేందాడు. బుధవారం మోహిదీపట్నం మిలటరీ క్యాంపులో గుర్తు తెలియని వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పంటించిన విషయం విదితమే. 90 శాతొ కాలిన గాయాలతో డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముస్తాఫా మృతి చెందాడు. సిద్దిఖీనగర్ లోని ముస్తఫా ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ ఆర్డీవో నవ్య, 15వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ శ్రీనివాసరావులు బుధవారం ఆసుపత్రికి వచ్చి బాలుడి వాంగ్మూలం తీసుకున్నారు. తాను ఆడుకుంటుండగా క్యాంపులో జవాన్లు పిలిచి పేరు అడిగారని, తర్వాత తనపై కిరోసిన్ పోశారని, పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకుని అగ్గిపుల్లతో అంటించారని వివరించాడు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనపై 3 ప్రత్యేక బృందాలు విచారణ జరుపుతున్నాయి. మరోవైపు ముస్తఫా మృతితో సిద్ధిఖీనగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోహదీపట్నం ఆర్మీ గేటు వద్ద ఆందోళనకు దిగారు. దీంతో మిలటరీ క్యాంపు ఎదుట పోలీసులు భారీగా మోహరించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.