కింగ్ నాగార్జున సినీ కెరీర్ కు గుడ్ బై చెప్తున్నారా…?

King-nagarjuna

టాలీవుడ్  తారలు ఒక్కొక్కరుగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. అక్కినేని త్రయం నటించిన మనం చిత్రం తప్ప నాగార్జున చేతిలో ఇప్పుడు ఏ చిత్రంలేదు. ఆ చిత్రం తర్వాత మరే చిత్రానికి అధికారిక ప్రకటన ఇవ్వలేదు నాగ్ . దీనికి తోడు ఈ మధ్యే నాగార్జున అమల దంపతులు మోదీని కలవడంతో కింగ్  పొలిటికల్  ఎంట్రీపై వార్తలు వచ్చాయి.
చిత్రపరిశ్రమలో హీరోగా రియల్ లైఫ్ లో బిజినెస్ మెన్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జునకు ఇప్పట్లో రిటైర్ ఆలోచనలు లేవని సన్నిహితులు కూడా చెప్తున్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న నాగార్జున హీరోగా ఇంకా కొన్ని చిత్రాలు చేస్తానని కథలు తన వయసుకు తగ్గట్లుగా ఎంపిక చేసుకుంటున్నారని సమాచారం. రిటైర్ మెంట్ ఆలోచనలను దగ్గరకు కూడా రానివ్వనని గతంలో ఆడియో ఫంక్షన్ లలో చాలాసార్లు చెప్పారు ఈ మన్మథుడు.
నాగార్జున ఈమధ్య నటించిన సినిమాలు కొన్ని ఆశించిన విజయాన్ని అందించక పోవడంతో ఇప్పుడు ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటున్నారు. టాలీవుడ్ లో హీరోగా మరికొన్ని చిత్రాలు రానున్నట్లు, అందులో ఒకటి మణిరత్నం దర్శకత్వంలో మహేష్ బాబు, నాగార్జున నటించబోయే సినిమా అయితే రెండవది వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్, నాగార్జున నటించబోయే సినిమా. ఈ రెండు సినిమాలపై కూడా త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
కింగ్ నాగార్జున త్వరలో ఓయంగ్  డైరెక్టర్ దర్శకత్వంలో నటిస్తున్నట్లు సమాచారం. స్వామిరారా చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు సుధీర్ వర్మకి తన తదుపరి చిత్రం అవకాశం ఇచ్చారట నాగార్జున. ముందుగా నాగచైతన్యతో సినిమా చేయాలనుకున్న సుధీర్ వర్మ నాగచైతన్య డేట్స్  కుదరకపోవడంతో కింగ్ కు మరో కథను వినిపించారట కథ నచ్చడంతో నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.