కిరణ్ పై బొత్స గుస్సా

  • రెండు నాల్కల కిరణ్ సర్కార్ ను కూలదోయకపోవడం పొరపాటు
  • పార్టీకీ, నాకు తీరని నష్టం జరిగింది
  • మంత్రి పదవికి రాజీనామా చేసి కిరణ్ అసలు రంగు బయటపెట్టాల్సింది
  • విభజనవాదినని ముద్ర వేస్తాడని భయపడ్డా
  • అదను వచ్చినప్పుడు కిరణ భరతం పడతా
  • ఆంతరంగికుల ఎదుట మనస్తాపం

హైదరాబాద్, అక్టోబర్ 13: రాష్ట్ర విభజన విషయంలో నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఎదిరించలేక పోయాను, తప్పు చేసానంటూ మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బాధ పడుతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు పరిస్థితులను తన సన్నిహితులకు సందర్భం వచ్చినప్పుడుల్లా వివరిస్తున్నారు. నాడు కిరణ్ కాబినేట్ నుంచి బయటికి వచ్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులు వచ్చేవి కావని, అలా చేయక పోవడం వల్ల పార్టీతోపాటు తనకు కూడా నష్టం జరిగిందని బొత్స ఆవేదన చెందుతున్నారు. స్వార్ధం కోసం కాబినేట్ లో కొనసాగడం వల్ల ఇప్పుడు అసలుకే మోసం వచ్చిందంటున్నారట.

botcha 3కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి, తెలుగు ప్రజలకు ద్రోహం చేసారని, తన స్వార్ధం కోసం తమందర్నీ బలి చేసారంటూ బొత్స ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కిరణ్ విభజన విషయంలో అధిష్టానం ముందు ఒక మాట బయటికి వచ్చి మరో మాట చెపుతున్నా మౌనంగా ఉండిపోయామే తప్పా, ఎదిరించలేక పోయామంటున్నారట. ద్వంద వైఖరితో ఉన్నారని తెలిసి కూడా కిరణ్ అసలు రంగును ప్రజలకు వివరించలేక పోవడం తన తప్పేనంటూ బొత్స సన్నిహితులకు చెపుతున్నారు. ఆ రోజు దైర్యం చేసి కిరణ్ మంత్రి వర్గం నుంచి బయటికి వచ్చుంటే పరిస్థితులు మరోలా ఉండేవని బొత్స భావిస్తున్నారట.

తను ముందుగా ధైర్యం చేసి మంత్రి పదవికి రాజీనామా చేసుంటే తనతో పాటు మరి కొంత మంది మంత్రులు కూడా రాజీనామా చేసేవారని, దీంతో కిరణ్ ప్రభుత్వం పడిపోయేదంటున్నారట. అలా సాధ్యం కాకపోతే కిరణ్ అసలు రంగును బయటికి చెప్పే అవకాశం వచ్చేదని బొత్స ఆవేదనతో అంటున్నారట. ఇప్పటికి ముఖ్యమంత్రి హోదాలో కిరణ్ విభజన విషయంలో అధిష్టానం ముందు చెప్పింది రహస్యంగానే ఉందని, సమయం వచ్చినప్పుడు దానిని వెల్లడించేందుకు బొత్స అవకాశం కోసం ఎదురు చూస్తున్నారట.

botcha 1విభజనకు సీమాంద్ర మంత్రులందరూ ముక్తకంఠంగా వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తున్న సమయంలో తనొక్కడినే మంత్రి పదవికి రాజీనామా చేసుంటే కిరణ్ తనను విభజన వాదిగా ముద్ర వేస్తారనే భయంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నానని బొత్స సన్నిహితులకు చెపుతున్నారట.  అయితే ఇప్పుడు మాత్రం బొత్స నాడు కిరణ్ ఎదిరించక పోవడం తన  రాజకీయ జీవితంలో పెద్ద పొరపాటని ఒప్పుకుంటున్నారట. నాటి తప్పిదం వల్ల పార్టీకి నష్టం వాటిల్లడంతో పాటు తన ఉనికి కూడా ప్రమాదం వాటిల్లిదని ఆవేదన చెందుతున్నారు.

మొత్తానికి మాత్రం కిరణ్ తమందర్నీ నట్టెట ముంచి ఆయనొక్కరే తెలుగు ప్రజల ప్రయోజనాలు అనే సాకుతో చివరి వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారంటూ నోటికొచ్చిన శాపనార్ధలు బొత్స పెడుతున్నారట.

బొత్స ఆవేదన చూసిన కొందరు సన్నిహితులు చేతులు కాలక ఆకులు పట్టుకుంటే ఏం లాభం, ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు చేస్తేనే ఫలితం ఉంటుంది, అంత జరిగిపోయాక ఏం అనుకుంటే ఏం ప్రయోజనమంటూ చురకలు అంటిస్తున్నారట.

Have something to add? Share it in the comments

Your email address will not be published.