కిష్టాపురంలో మరో ఆత్మహత్య

ఖమ్మం, అక్టోబర్ 8: అతి ప్రేమలు ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ఎంతో ప్రేమగా పెంచుకున్న అపురూపమైన వారు దూరమైతే తట్టుకోలేక పోతున్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ లో ఇక్ఫాయ్ అధ్యాపకుడు గురుప్రసాద్ తన ఇద్దరు కుమారులను హత్యేచేసి, తాను ఆత్మహత్మ చేసుకున్న సంఘటన, అలాంటిదే కడప నబీకోటలో జియోన్ ఇంగ్లీషు పాఠశాల నిర్వహిస్తున్న కృపాకర్ ఐజాక్ భార్య, ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరువక ముందే మరో ఘటన. తాజాగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన ఆర్ ఎం పి గా ఉన్న శ్రీనివాస రావుకు ఇద్దరు కవలలు ఉన్నారు.  అందులో కూతురు హర్షిణి అస్వస్థతకు గురై చికిత్స పొందుతు ఆసుపత్రిలో మృతిచెందింది. అత్యంత ప్రేమగా చూసుకుంటున్న కూతురు చనిపోవడంతో తండ్రి శ్రీనివాస రావు తట్టుకోలేక పోయాడు. ఈ తెల్లవారు జామున శ్రీనివాస రావు రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తును చేపట్టారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.