కుదుటపడుతున్నరూపాయి

కుదుటపడుతున్నరూపాయి

ముంబయిర : బుధవారం కూడా భారత రూపాయి పతనం యథతథంగా కొనసాగింది. కనిష్ట స్థాయికి 68.75కు పడిపోయింది. డాలర్ తో రూపాయి మారకం రేటులో ఇదే రికార్ఢు పతనం. కాని ఈ రోజు మార్కెట్ ముగిసే సరికి రూపాయి కొద్దిగా కోలుకుంది. మార్కెట్ ముగింపు సమయానికి రూపాయి విలువ డాలర్ తో పోల్చితే 68.11కు చేరింది. ఆందోళనల ప్రభావం, సిరియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా అక్కడ దాడులు చేసే అవకాశం, తదితర కారణాలు రూపాయిని దెబ్బతీశాయి. అమెరికా డాలర్, ఇతర ప్రధాన దేశాల కరెన్సీ తో పోల్చితే భారత రూపాయి చాలా పతనమైంది. మంగళవారం డాలర్ తో పోల్చితే రూపాయి విలువ 66.24 ఉండగా నేడు మార్కెట్ ముగిసే సమయానికి 68.11కు చేరుకోవడం రికార్డు పతనం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.