కుప్పకూలిన భవనాలు

కుప్పకూలిన భవనాలు

వడోదర : గుజరాత్ లోని వడోదర జిల్లాలో రెండు ఏడంతస్తుల భవనాలు కుప్పకూలాయి. ఈ రోజు ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. శిధిలాల క్రింద కనీసం 35 మంది చిక్కకుపోయారని భావిస్తున్నారు. వడోదర జిల్లా కలెక్టరు వినోదరావు మాట్లాడుతూ ఈ భవనాల నుంచి 8మందిని ఖాళీ చేయించామని, ఐదుగురు మరణించారని తెలియజేశారు. బాధితులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రక్షణ చర్యలు పర్యవేక్షించడానికి ఇద్దరు కేబినేట్ మంత్రులను ప్రభుత్వం నియమించింది. ఈ రెండు భవనాల్లో ఒకటి ఖాళీగా ఉండడం వల్ల ప్రాణనష్టం తగ్గింది. రెండవ భవనంలో 12 కుటుంబాలు నివాసముంటున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.