కృష్ణపట్నం ఓడరేవుకు చేరుకున్న సచిన్

నెల్లూరు, నవంబర్ 15: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ తెందుల్కర్ శనివారం కృష్ణపట్నం ఓడరేవుకు చేరుకున్నారు. కృష్ణపట్నం సెక్యూరిటీ అకాడమీకి చేరుకున్న సచిన్ ను కేపీసీఎల్ ఎండీ శశిధర్ సాదరంగా ఆహ్వానించారు. సెక్యూరిటీ గార్డుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కృష్ణపట్నం పోర్టు కార్యకలాపాలను పరిశీలించారు. నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు `సంసద్ గ్రామీణ యోజన పథకం` కింద నెల్లూరు జిల్లా, గూడూరు మండలం, పుట్టం రాజు వారి కండ్రిగ గ్రామంలో సచిన్ పలు అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు.  జిల్లాలోని పుట్టం రాజు కండ్రిగ గ్రామాన్ని సచిన్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

Have something to add? Share it in the comments

Your email address will not be published.