కేంద్ర మంత్రి పదవికి జయంతి నటరాజన్ రాజీనామా

కేంద్ర పర్యావరణ, అటవీ శాఖా మంత్రి పదవికి జయంతి నటరాజన్ రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. దాంతో, ఈ బాధ్యతలను వీరప్ప మొయిలీకి అదనంగా అప్పగించారు. 2014 ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేసేందుకు ఆమె పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ అంతర్మథనంలో పడింది. తాజా ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో ఘోరపరాభవం చెందిన కాంగ్రెస్ పార్టీ నష్టనివారణ చర్యలకు పూనుకుంటోంది. రాహుల్ ను పార్టీవర్గాలు ప్రధాని అభ్యర్థిగా అనుకుంటుండడంతో జరుగుతున్న పరిణామాలన్నీ అతని తలకుచుట్టుకుంటున్నాయి. తాజా ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వంటి అంశాలన్నీ కాంగ్రెస్ పార్టీకి తలనెప్పిగా పరిణమించాయి. రాహులే కాదు సాక్షాత్తూ సోనియా రంగంలోకి దిగినా పెద్దగా ఫలితం కన్పించడం లేదు.

రాష్ట్రల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న లుకలుకలకు తోడు పెరిగిన ధరలు, చాలీ చాలని జీతాలు, అక్కరకు రాని పథకాలు కాంగ్రెస్ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. దీంతో తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చావు తప్పి కన్నులోట్టబోయింది. ఇదే అనుభవం పునారావృతం అవ్వకుండా చూసుకునేందుకు కాంగ్రెస్ అధినేత్రి పార్టీలో కీలక నేతలకు పార్టీని పటిష్ఠం చేసే బాధ్యతను అప్పగించనున్నారు.

అందులోభాగంగానే జయంతీ నటరాజన్ రాజీనామా అని తెలుస్తొంది. ఆమె బాటలో మరో పది మంది కేంద్ర మంత్రులు పదవులకు రాజీనామాలు చేసి పార్టీ కార్యకలాపాల్లో పాలుపంచుకునేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. వీరిలో గులాంనబీ ఆజాద్, జైరాం రమేష్, ఏకే ఆంటోనీ, సల్మాన్ ఖుర్షీద్ వంటి పలువురు నేతలు ఉన్నారని సమాచారం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.