కేజ్రీవాల్ అవినీతిపరుల లిస్టులో వైఎస్ జగన్

Kejriwal-corruption-list

ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అవినీతి నేతల చిట్టా బయటపెట్టారు. జన్ లోక్ పాల్ ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో దేశంలోని అవినీతి నేతల పేర్లను బయటపెట్టారు.

అరవింద్ కేజ్రీవాల్ అవినీతిపరుల లిస్టులో బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, కేంద్రమంత్రులు సుశీల్ కుమార్ షిండే, కపిల్ సిబాల్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి తదితరుల పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును కేజ్రీవాల్ అవినీతిపరుల లిస్టు చదివి వినిపించారు.

తమ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారని, ఇప్పుడు వారు గెలిస్తే అదంతా ప్రజల నుండి వసూలు చేస్తారని, అలాంటప్పుడు వారి నుంచి సమర్ధవంతమైన పాలన ఎలా ఆశిస్తామని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఒక్క అవినీతి నేత కూడా లోక్ సభలోనికి ప్రవేశించకుండా అడ్డుకోవాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.