‘కేరింత’ మూవీ కోసం దిల్ రాజు స్టార్ హంట్

Dil-raju

ప్రముఖ నిర్మాత, నైజాం డిస్ట్రీబ్యూటర్ దిల్ రాజు ఓ పక్క తను భారీ చిత్రాలను నిర్మిస్తూనే…మరో పక్క ఓ చిన్న చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు. ఆ చిత్రమే ‘కేరింత’. ఈ చిత్రానికి సాయికిరణ్ అడవి దర్శకత్వ బాధ్యతలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కొత్త తారలు నటిస్తున్నారు. ‘కేరింత’ సినిమా గురించి దిల్ రాజు మాట్లాడుతూ.. ” సాయి కిరణ్ చెప్పిన స్టోరీ నాకు నచ్చింది. దీంతో ఆ స్టోరీని అబ్బూరి రవితో కూర్చుని బాగా డెవలప్ చేశాము. ఇప్పుడు స్టోరీ అంతాకూడా పర్ ఫెక్ట్ గా వచ్చేసింది. కేరింతలు చిత్రం ద్వారా ఐదుగురు అమ్మాయిలను, ముగ్గురు అబ్బాయిలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాం. దీనికోసం స్టార్ హంట్ కూడా జరుగుతోంది. అందులో భాగంగానే ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది” అని చెప్పారు.

మొదటి నుంచి నూతన దర్శకులు పరిచయం చేసిన తాను, అనుకోని కారణాలు, టైమ్ సరిపోకపోవడం వల్ల పెద్ద సినిమాలకు పరిమితమయ్యాననీ, కేరింత చిత్రంతో మళ్లీ చిన్న చిత్రాల నిర్మాణం కూడా మొదలు పెట్టానని దిల్ రాజు అన్నారు.

కేరింతులు సినిమాలో నటించాలని ఆసక్తి ఉన్నవారు స్టార్ హంట్ ఆడిషన్స్ కోసం dilrajustarhunt@gmail.com కి మెయిల్ చేయండి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.