కేవలం కృతజ్ఞతలు చెప్పేందుకే: కేసీఆర్

kcr-family-meet-sonia

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఆయన కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. కేసీఆర్ తో పాటు కుమారుడు తారకరామారావు, కుమార్తె కవిత, మేనల్లుడు హరీశ్ రావు సోనియా నివాసానికి తరలి వెళ్లారు. కాగా, తెలంగాణ కలను సాకారం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పేందుకే తమ కుటుంబం కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిసిందని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు చెప్పారు.

సోనియాతో సమావేశం ముగిసిన వెంటనే మీడియాతో మాట్లాడుతూ, మేడమ్ కు థ్యాంక్స్ చెప్పామని, సోనియా గాంధీ వల్లే తెలంగాణ సాధ్యమైందని తెలిపారు. తాము ప్రధాని, రాష్ట్రపతిని కూడా కలవనున్నామని కేసీఆర్ చెప్పారు. కాగా, భేటీ సందర్భంగా కేసీఆర్ కుటుంబ సభ్యులను బయటికి పంపి సోనియాతో పది నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడినట్టు సమాచారం.

ఇదిలా వుంటే టీఆర్ఎస్ స్వతంత్ర పార్టీగా ఉండాలనే అత్యధికులు కోరుకుంటున్నారని, కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము గౌరవిస్తామని టీఆర్ఎస్ నేతలు తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.