కేసీఆర్… ఖాళీ కావడానికి టీడీపీ బ్రాందిసీసా కాదు: బాబు

chandrababu-naidu

కేసీఆర్ గుండెల్లో నిద్రపోయే పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతుందని కేసీఆర్ చెబుతున్నారని ఆయన చెబుతున్నట్టు ఖాళీ అవడానికి టీడీపీ బ్రాందీ సీసా కాదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే సీఎంలాంటి ముఖ్య పదవులన్నీ బీసీలకు ఇస్తామని చెప్పారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం కాంగ్రెస్ పార్టీ దివాళాకోరు తనానికి నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్ కు ఎప్పుడు అధికారం ఇచ్చినా ఒక్క ఐదేళ్లపాటు కూడా స్థిరమైన పాలన అందించలేక పోయిందని విమర్శించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.