కేసీఆర్ ఢిల్లీ నుండి తిరిగిరారు: గంటా

Ganta-srinivasa-rao

రాష్ట్రపతికి బిల్లు చేరిన తర్వాత కోర్టుకు వెళ్లే విషయంపై నిర్ణయం తీసుకుంటామని గంటా శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రభుత్వం తరఫున కోర్టుకు వెళ్లాలా? లేదా సీమాంధ్ర ఎమ్మెల్యేలందరూ పిల్ దాఖలు చేయాలా? అనే విషయంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు. టీ.బిల్లు గెలిచే అవకాశం లేదని న్యాయకోవిదులు కూడా చెబుతున్నారని గంటా తెలిపారు.

కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా రాజ్యసభ బరిలో దిగిన ఆదాలకు మద్దతిచ్చే విషయంపై మరో రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం తరపునే ఢిల్లీ నుంచి తిరిగి వస్తానన్న కేసీఆర్ గురించి మాట్లాడుతూ, ఆయన తిరిగి వస్తారో లేక ఢిల్లీలోనే ఉండిపోతారో తెలుస్తుందని  గంటా చెప్పారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.