కేసీఆర్ తో జైరాం రమేష్ భేటి

jairam-ramesh-meet-kcr

రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంలో కీలక సభ్యుడిగా ఉన్న జైరాం రమేష్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశమయ్యారు. కేసీఆర్ ఇంటికి వచ్చిన జైరాం రమేష్ దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. రాష్ట్ర ముసాయిదా బిల్లుపై టీఆర్ఎస్ ఇచ్చిన సవరణలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగులు, ఫించన్ దారులను కేటాయించడం వంటి అంశాలతో పాటు ఢిల్లీలోని ఏపీభవన్ విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే టీఆర్ఎస్ చేసిన ప్రతిపాదనల్లో కొన్ని సాద్యం కావని అందుకు ఇతర ప్రత్యామ్నయాలు చూపిస్తామని జైరాం రమేష్ హామీ ఇచ్చినట్లు సమాచారం. చర్చ సందర్బంగా సవరణల కోసం పట్టుబట్టవద్దని కోరినట్లు తెలుస్తోంది. నది జలాల పంపిణీ విషయంలో జీవో అందరికీ ఆమోద యోగ్యమైన ప్రతిపాదనలు చేసినట్లు కేసీఆర్ కు వివరించినట్లు సమాచారం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.