కేసీఆర్ నల్లధనాన్ని ఎరువుగా వేసి తెల్లధనాన్ని పండిస్తున్నారు: మోత్కుపల్లి

Mothkupalli-narasimhulu

చీకటి ఒప్పందాలకు తెలంగాణ ప్రజలను బలి చేయవద్దని కేసీఆర్ ను కోరుతున్నామని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని డబ్బులకు అమ్ముకున్న ఘనత కేసీఆర్ కుటుంబానిదే అని ఆయన మండిపడ్డారు. ఫాంహౌస్ లో వ్యవసాయం చేస్తూ, ఎకరానికి కోటి సంపాదిస్తున్నానని విలేకరులను తీసుకెళ్లి చూపించారని వ్యవసాయంలో అంత ఆదాయం ఉంటే ఇంత మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ పార్టీ సీటు ఆశించే వారే కేసీఆర్ పంటను అంత ధరకు కొంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తన దగ్గరున్న నల్లధనాన్ని ఎరువుగా వేసి తెల్లధనాన్ని పండిస్తున్నారని ఆరోపించారు. ఈ రోజు ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తుపాకి రాముడులాంటి వాడని అన్నారు. సభలో తెలంగాణ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేయడం బాధాకరమని ఏదో విధంగా కాలయాపన చేసి బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.