కేసీఆర్ సమక్షంలో కారెక్కిన రసమయి, శ్రీనివాస్ గౌడ్

Srinivas-goud-join-trs

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సమక్షంలో మరో ఇద్దరు నేతలు ఆదివారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీజీవో నేతగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ టీఆర్ఎస్ లో చేరారు. అంతకు ముందు టీడీపీలో ఉన్న జైపాల్ యాదవ్, ఇక ఇప్పుడు ‘కారు’ఎక్కారు. వీరిద్దరికీ కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

తెలంగాణ కళాకారుడు రసమయి బాలకిషన్ టీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ ఆయనను గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే ఆదివారం ఉదయం కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రసమయి కాంగ్రెస్ లో చేరతారని తెలిపారు. కానీ పొన్నం అంచనాలను తారుమారు చేస్తూ రసమయి బాలకిషన్ కారెక్కారు

Have something to add? Share it in the comments

Your email address will not be published.