కొత్త ఛాంబర్ లోకి ప్రవేశించిన చంద్రబాబు

హైదరాబాద్, అక్టోబర్ 3: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్ ను క్యాంప్‌ కార్యాలయంగా చేసుకొని పాలన కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సచివాలయంలోని ఎల్ బ్లాక్ 8వ అంతస్తులో చంద్రబాబుకు ఛాంబర్ కేటాయించారు. శుక్రవారం విజయదశమి కావడంతో మధ్యాహ్నం ఆయన సచివాలయంలోని కొత్త ఛాంబర్లోకి అడుగుపెట్టారు. వేదపండితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. దాదాపు పది సంవత్సరాల తరువాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన నేడు సచివాలయంలోకి అడుగుపెట్టారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, ఆశీస్సుల మధ్య చంద్రబాబు కొత్త కార్యాలయంలో విధులకు శ్రీకారం చుట్టి పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ రాముడు, ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగ సంఘాల నేత మురళీకృష్ణ తదితరులు సీఎం వెంట ఉన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.