కొత్త పార్టీపై దృష్టి సారించిన మాజీ సీఎం

Kiran-kumar-reddy-convoy

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీపై దృష్టి సారించారు. పార్టీ పెడతానని ప్రకటించినప్పటి నుంచి పార్టీ విధివిధానాలు, పార్టీకి ఏ పేరు పెట్టాలి అన్న అంశాలపై సన్నిహితులతో విస్తృతంగా చర్చిస్తున్నారు. రెండు రోజులుగా మాదాపూర్ లోని పార్టీ కార్యాలయంలో నేతలు, సన్నిహితులతో చర్చలపై చర్చలు చేస్తున్నారు.

మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కొత్తపార్టీ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇప్పటికే రిజిష్టరైన నాలుగు పార్టీలపేరును పరిశీలించిన కిరణ్ సన్నిహితులు జై సమైక్యాంధ్ర పార్టీకే మెగ్గుచూపినట్లు తెలుస్తోంది. జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు చుండ్రు శ్రీహరిరావు,లగడపాటి రాజగోపాల్, పితాని సత్యనారాయణలతో సమావేశమైన కిరణ్  పార్టీ రిజిస్ట్రేషన్  పై చర్చించినట్లు సమాచారం. చుండ్రు శ్రీహరిరావు తాను రిజిస్టర్ చేసుకున్న పార్టీని కిరణ్ కొత్తపార్టీగా ప్రకటించుకునేందుకు అంగీకరించినట్లు సమాచారం. అటు కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీకి సీమాంధ్రలో విశేష ఆదరణ లభిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసీరెడ్డి, టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుతుహులమ్మ, పాముల రాజేశ్వరీదేవీలు మాజీ సీఎం కిరణ్ తో సమావేశమయ్యారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పార్టీని స్థాపించబోతున్నట్లు చెప్పిన కార్యకర్తల అభీష్టాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కిరణ్  చెప్పినట్లు వారు తెలిపారు. అటు సినీనటుడు సుధాకర్ నాయుడు, జీవా  కిరణ్ కుమార్ రెడ్డిని కలుసుకున్నారు. త్వరలో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని ఆంధప్రదేశ్ లో పోటీచేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు ప్రకటించారు. మొత్తానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాట్లు బిజీబిజీగా గడుపుతుండటంతో పార్టీ విధివిధానాలు స్పష్టంగా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Have something to add? Share it in the comments

Your email address will not be published.