కొత్త సంవత్సరం వేడుకలపై పోలీసుల ఆంక్షలు

new year celebrations-24

హైదరాబాద్, డిసెంబర్ 24: సైబరాబాద్ పరిధిలో కొత్త సంవత్సరం వేడుకలపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఈ నెల 31 రాత్రి 11 గంటలనుంచి ఉదయం 5 గంటల వరకు  నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేస్తామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించేవారు 31వ తేదీ రాత్రి 1 గంటలోపు గానే ముగించాలని సీపీ తెలిపారు.

మధ్యపానం సేవించి అతి వేగంగా డ్రైవింగ్ చేసే వారిపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. దీంట్లో భాగంగా నగరంలోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతో పాటు నగరంలో వివిధ ప్రదేశాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఆయుధాలతో వచ్చినవారిని ఎట్టి పరిస్థితుల్లో పబ్బులోకి అనుమతించవద్దని, అటువంటి వారిపై కఠినమైన చర్యలు తప్పవని సీపీ ఆనంద్ హెచ్చరించారు. ఆయుధాలతో వచ్చినవారి పట్ల క్లబ్, పబ్ యజమానులదే బాధ్యతని ఆయన తెలిపారు. అదే విధంగా వేడుకలకు ఒంటరిగా వచ్చే పురుషులు, మహిళలకు అనుమతి లేదని ఆయన తెలిపారు.

అనుమతి లేకుండా పోస్టర్లు, హోర్డింగులు బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటుచేయవద్దన్నారు. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు అన్ని ఫ్లై ఓవర్స్, అవుటర్ రింగ్ రోడ్లు మూసివేస్తామని, ప్రతి పార్టీలో 2000 వేలకు మించి ఉండవద్దని, ఫాం హౌజ్ లు, రిసార్ట్స్, హోటల్స్, పబ్ లకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కమీషనర్ సీపీ సీవీ ఆనందర్ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.