కోయిల్ అళ్వార్ తిరుమంజన సేవ

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అలయాన్ని శుద్ది చేసే కో‍యిల్ అళ్వార్ తిరుమంజనం సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు.  ప్రతి సంవత్సరం ఉగాది, అణివార అస్ధానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందే వచ్చే మంగళవారాల్లో ఈ సేవను జరపడం అనవాయితీ. గర్భాలయంలోని అన్ని ఉత్సవవిగ్రహలతో పాటు బంగారు, వెండి పాత్రలను ఘంటా మండపానికి తీసుకుని వచ్చారు. గర్భాలయంలోపల నిత్యం వెలిగే అఖండదీపాల కారణంగా దుమ్ముధూళి, మసి పెరుకుపోతుంటుంది. ఆలయంలోపల కర్పూరం, నేతి దీపాల మసిని, అలాగే దుమ్ముధూళి , బూజులను తొలిగించి శికాయ నీటితో గోడలను శుభ్రం చేశారు. అనంతరం నామంకోపు, శ్రీచుర్ణం, గడ్డకర్పూరం, గంధం పోడి, కుంకమ, ఖిచిలిగడ్డలను మిశ్రమంగా చేసి ఆలయ గోడలకు  పై పూతగా పూయడంతో కోయిల్ అళ్వార్ తిరుమంజనం ముగిసింది. ప్రతినిత్యం స్వామివారి పూజకైంకర్యాలకు వినియోగించే వస్తు, సామగ్రిలను శుభ్రం చేయడంతో పాటు, వాటిలో ఏవైనా మరమ్మతులకు గురైవుంటే, వాటిలో స్థానంలో కొత్తవి తీసుకొని వచ్చేందుకు కూడా ఈ సేవ ఉపయోగపడుతుంది. ఈ సేవలో టీటీడీ ఆలయ అధికారులు మరియు సిబ్బంది తరతమ భేదాలు లేకుండా స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారి సేవ చేసేందుకు పేద, ధనిక, వంటి తారతమ్యాలు లేవని, అందరూ భగవంతుడి దృష్టిలో సమానమని చాటి చెప్పడమే ఈ కోయిల్ అళ్వార్ తిరుమంజనం ప్రధానోద్దేశ్యం.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవలో టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఆలయ అధికారులు మరియు భక్తులు

కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవలో టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఆలయ అధికారులు మరియు భక్తులు

Have something to add? Share it in the comments

Your email address will not be published.