కోల్ కతా రిటైర్డు సెక్స్ వర్కర్లకు ప్రభుత్వ గృహాలు

అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా కోల్ కతా లోని సోనాగచి. ఈ రెడ్ రైట్ ఏరియాలోని రిటైర్డ్ సెక్స్ వర్కర్లకు ఆసరాగా ఉండేందుకు వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. పాతతరం సెక్స్ వర్కర్లు పలు వ్యాధులు, పేదరికంతో బాధపడుతున్నారని వారికి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని మమతా సర్కార్ వెల్లడించింది.

ఇందులో భాగంగా వీరికోసం రెండు భవంతులను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో వారికి ఆహారం, దుస్తులు, ఆవాసం, హెల్త్ కేర్ లాంటి సదుపాయాలన్ని ఉంటాయని తెలిపింది. సోనాగచి ప్రాంతంలో 750 మంది వృద్ధులైన సెక్స్ వర్కర్లు ఉన్నారని వీరిలో చాలామంది హెచ్ఐవీతో బాధపడుతున్నారని గుర్తించారు. ఈ వయసులో వారు ఎలాంటి సమస్యలు లేకుండా, ఆనందంగా జీవించేందుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తెలిపింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.