క్యాన్సర్ తో బాధపడుతున్న బాలుని పరామర్శించిన చిరంజీవి

chiru-balu-25

హైదరాబాద్, డిసెంబర్ 25: కాన్సర్ తో పోరాటం చేస్తున్న ఓ 10 ఏళ్ల బాలుడి కోరికను చిరంజీవి తీర్చారు. బాలుని చూసేందుకు స్వయంగా చిరంజీవి ఎంఎన్ జే అసుపత్రికి చేరుకున్నారు. హైదరాబాద్ ఎంఎన్ జే క్యాన్సర్ అసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలు తన ఆరాధ్యనటుడైన చిరంజీవిని చూడాలని ఉందని తన తల్లి దండ్రులకు చెప్పాడు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న చిరంజీవి ఎంఎన్ జె అసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుని పరామర్శించారు.

చిరంజీవి చూసిన వెంటనే బాలుని తల్లిదండ్రులు తీవ్ర ఉద్వేగానికి లోనై కనీళ్ల పర్యంతమయ్యారు. తమ పిల్లాడు కలలుగంటున్న చిరంజీవి స్వయంగా వచ్చి తమను పరామర్శించడంతో వాళ్ల ఆనందానికి అవధులు లేవు. బాలు కూడా చిరంజీవిని చూసి కనీళ్లు పెట్టుకున్నాడు. చిరంజీవి బాలుని ఓదార్చి తను వెంట తెచ్చిన ఆటవస్తువులను బాలుకి అందజేశారు. తను ఎంగానో ఇష్టపడే చిరంజీవి తనను చూడటంకోసం హస్పటల్ కు తరలిరావడం బాలు ఎంతగానో సంతోషపడ్డాడు. బాలుడి చేతికి ఒక రక్షాబంధన్ కట్టి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.