ఖమ్మంలో సిపిఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలు

ఖమ్మం, సెప్టెంబర్ 30: సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రథమ మహాసభలు 2015 మార్చి మొదటి వారంలో ఖమ్మంలో జరుపనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు తెలిపారు. మంగళవారం స్థానిక గిరిప్రసాద్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడుతూ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని పార్టీ యంత్రాంగాన్ని, ప్రజా సంఘాలను సమాయత్తం చేయనున్నట్లు ఆయన తెలిపారు. 32 సంవత్సరాల తరువాత రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో జరుగుతున్న నేపథ్యంలో పార్టీ శాఖలను సమాయత్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా ఉద్యమ నిర్మాణానికి అనుగుణంగా గత పోరాటాలను నేటి తరాలకు తెలియజేస్తూ భవిష్యత్ పోరాటాలకు నాంది పలికే విధంగా రాష్ట్ర మహాసభలను నిర్వహించనున్నట్లు బాగం పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పోటు ప్రసాద్, కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి, శింగు నర్సింగరావు, మందడపు తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.